భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభివృద్ధి పనులు ఉండాలి
చండూరు మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులను భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.
శనివారం ఆయన మున్సిపాలిటీ లో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. మున్సిపాలిటీకి కనెక్ట్ అయ్యే వివిధ గ్రామాల లింకు రోడ్లను 60ఫిట్లకు వరకు విస్తరించాలని అన్నారు.