ఎనగంటి తండా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఇంచార్జ్ బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

ఎనగంటి తండా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఇంచార్జ్ బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం శనివారం ఎనగంటి తండా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంచార్జ్ బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ సందర్శించి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి లోని ఉన్నటువంటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార ఇస్తున్నారా లేరని సందర్శించి చూశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రాథమిక పాఠశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలు పాఠశాల కు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేస్తుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్ప వెంకటేష్, గ్రామ ఉపసర్పంచ్ లచ్చు నాయక్, శంకర్ నాయక్, నీలు నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు తోర్పునూరి రవి గౌడ్, మలిగే మల్లేష్, ఎనగంటి తండా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment