ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం

రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి పత్రాలు అందుకున్న గ్రామ మహిళలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, లోక్ సభ సభ్యురాలు డీకే అరుణ గారితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment