అర్హులైన పేద, ప్రజలకు మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ, ఇళ్లులు ఇవ్వాలి

అర్హులైన పేద, ప్రజలకు మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ, ఇళ్లులు ఇవ్వాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్హులైన పేద, ప్రజలకు బలహీనవర్గాలైన మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. అనంతరం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.డీ షబ్బీర్ అలీ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐటీయూసీ బలహీన వర్గాల వైపు ఉంటుందని అన్నారు.

గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో అనేక అవకతవకలు వున్నాయని, పేద ప్రజలకు కాకుండా భవంతులు వున్న వారికే మళ్లీ ఆ అవకాశం కల్పించాలని చూస్తున్నారని అన్నారు. పేద ప్రజల అపోహలు తొలగించి వెంటనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment