పెద్దపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
_జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి_
పెద్దపల్లి, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే.రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 08 వరకు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ శిక్షణకు BC – A, B, D కి చెందిన, డిగ్రీ పూర్తి చేసి 26 సంవత్సరాల వయసులో ఉన్న అభ్యర్థులు అర్హులనీ, అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతంలో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో 2.00 లక్షల లోపు ఉండాలని. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ను తేదీ 12-04-2025 న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని చెప్పారు.
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 మందిని అభ్యర్థులను ఎంపిక చేస్తామని సూచించారు శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
మరిన్ని వివరాలకు 0878 – 2268686 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.