స్పేడెక్స్ డాకింగ్ ఆపరేషన్ వాయిదా.. ప్రకటించిన ఇస్రో

 అంతరిక్షంలో స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(SpaDeX) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా 440 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. తాజాగా, ఈ పరీక్షకు సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. 

 SpaDeX డాకింగ్ ఆపరేషన్‌ను 2025, జనవరి 9కి రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. సోమవారం(జనవరి 6) గుర్తించిన అబార్ట్ దృష్టాంతం ఆధారంగా గ్రౌండ్ సిమ్యులేషన్స్ ద్వారా డాకింగ్ ప్రక్రియకు మరింత ధ్రువీకరణ అవసరమని ఇస్రో పేర్కొంది. అంతకుముందు ఈ డాకింగ్ ఆపరేషన్‌ను జనవరి 7న ప్లాన్ చేసినట్లు ఇస్రో తెలిపింది. తాజాగా ఆ గడువును రెండు రోజులు పొడిగించింది. SPADEX ఆన్‌బోర్డ్ వీడియోను ఇస్రో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment