అంతా మా ఇష్టం అడ్డొస్తే … కతమే..?!

78 సర్వే నెంబర్ లోని భూమి పట్టానా..ప్రభుత్వమా భూమా ?*

వ్యాపార సముదాయాలు నిర్మించడానికి అనుమతి ఎవరు ఇచ్చారు..

ఎర్రన్నల పోరాటం ఎవరికోసం…?

సమస్యలపై ప్రశ్నిస్తే.. అక్రమ కేసులేనా…

మునుగోడు డిసెంబర్ 16:(సమర శంఖమ్ ) 

మునుగోడు పట్టణ కేంద్రం నుండి చండూర్ వెళ్లే ప్రధాన రహదారికి అనుకొని ఉన్న 78 సర్వే నెంబర్ లోని భూమి అంటేనే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హార్ట్ టాపిక్ గా మారింది… సర్వే నెంబర్ 78 లోని ప్రభుత్వ భూమిని నిరుపేదలైన రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం లావణ్య పట్టాను కేటాయించింది. కానీ మండలంలోని కొంతమంది బడ వ్యాపారవేత్తలు లావణ్య పట్టాదారులకు డబ్బులు ఆశ చూపి మోసపూరితంగా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు.గత కొంత కాలంగా వ్యాపార సముదాయాలకు సరైన ఆధారాలు చూపకుండా ప్రభుత్వ అధికారులను మోసం చేసి కొంతమంది అనుమతులు తీసుకున్నారు.మరికొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ఈ అక్రమ నిర్మాణాల కోసం అధికారులకు ముడుపుల ఆశ చూపి అనుమతులు తెచ్చుకున్నారు. కొంతమంది జర్నలిస్టులు ఈ అక్రమ నిర్మాణాలను పసిగట్టి ఈ అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించారు. కానీ అవి ప్రకటనకే పరిమితం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణదారులు మళ్లీ వ్యతిరేక పత్రిక కథనాలను రాయకుండా జర్నలిస్టులకు అధిక మొత్తంలో డబ్బులు అందయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు పట్టణానికి చెందిన ఒక విద్యార్థి సంఘం నాయకుడు 78 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని ప్రభుత్వం స్వాధీనం తెచ్చుకోని అట్టి భూమిలో ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మండల తహశీల్దారు కి ఆర్డిఓ కి పిర్యాదులు చేశారు. అధికారులు మాత్రం నామమాత్రంగానే నోటీసులు జారీ చేశారు.రోజులు గడుస్తున్నా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ విద్యార్థి సంఘం నాయకుడు తెలంగాణ లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశాడు . లోకాయుక్తలో పిటిషన్ పై విచారణ జరుగుతుందని గ్రహించిన అక్రమ నిర్మాణదారులు మండలంలోని కొంత మంది ఎర్రన్నలను ఆశ్రయించారు. ఎర్రన్నలు అక్రమ నిర్మాణదారులను మద్దతుగా కొంతమంది జంగాల కులాలకు చెందిన నిరుపేదలను మభ్యపెట్టి నీ గుడిసెలు కులగోడతారని భయాందోళనలకు గురిచేసి వారితో కలిసి అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా ధర్నాలు రాస్తారోకోలు చేపించారు . ఈ ఎర్రన్నలు ఎందుకు అక్రమ నిర్మాదారులకు కొమ్ము కాస్తున్నారు నేటికీ అర్థం కాని ప్రశ్న ఇది.

రాష్ట్ర లోకాయుక్త లో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థి సంఘం నాయకుడకి డబ్బులు ఆశ చూపి బెదిరించి అయినా వినకుండా ఉన్నందుకు అతనిపై అక్రమంగా కేసు పెట్టించి జైలు పాలు చేశారు.78 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాల జోలికి ఎవరు వచ్చిన వదిలిపెట్టే ప్రసక్తే లేదని అక్రమ నిర్మాణదారులు మొండిగా ప్రవర్తిస్తున్నారు. వారికి ధన బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు. ఎవరి ధైర్యం చూసుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న జర్నలిస్టులు ఎందుకు మౌనంగా ఉన్నారు.  ఉన్నత అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కనబడటం లేదా ఎర్రన్నలు అక్రమ నిర్మాణదారులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు. తెలంగాణ లోకాయుక్త తీర్పు ఏ విధంగా రాబోతుంది. ప్రభుత్వ స్థలాలను కాపాడే నాయకుడే లేడా ?ఇకనైనా కళ్ళు తెరిచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 78 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన వ్యాపార సముదాయాలను తొలగించి అట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలకు కేటాయించగలరు అని మునుగోడు మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment