రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా.. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు.. నేను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయను.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జగన్కు ప్రజాధరణ తగ్గదు.. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు
కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. నాకు ఉంది.. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు.. నా రాజీనామా వల్ల రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుంది.