జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమానుషం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమానుషం

–తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ.

–రైతులపై దాడి చేసిన పోలీసులు!!

–అటవీ భూములను సాగు చేస్తున్నారని దాడి!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు.

తాత ముత్తాతల నుంచి 11 మంది రైతులం 25 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని, ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసి కూడా వచ్చి దాడి చేశారని… నిన్న జిల్లా ఆటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి 150 మంది పోలీసులతో వచ్చి తమను బూటు కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారని.. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళా రైతులు తెలిపారు.

కొండి శారద, పొదిళ్ల శ్రీను, పొదిల్లా రజిత అనే రైతులను తాళ్లతో కట్టేసి అధికారులు వారి వాహనాల్లో తీసుకువెళ్ళారు. వారి ఆచూకీ తెలిపి, గత నాలుగేండ్లుగా తమ దగ్గర దాదాపు 5లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటూనే, తమ కొడుకులపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment