మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా..

మహబూబాబాద్, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:- జిల్లా ఉపాధి కార్యాలయం, మహబూబాబాద్ ఆధ్వర్యంలో ముతూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ కంపెనీ, మహబూబాబాద్, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ అధికారి పోస్టునకు ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హతతో అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు ఈ నెల 20వ తేదిన జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు మహబూబాబాద్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం, రూమ్ నెం. 25, రెండవ అంతస్తు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము, కురవి రోడ్, మహబూబాబాద్ నందు ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జరుగు జాబ్ మేళాకు అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు / రెజ్యుం తో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు సంస్థ హెచ్.ఆర్. సంజీవ్ 9037957941, బ్రహ్మం 9037956357 ఫోన్ నెంబర్లలో సంప్రదించి వివరాలు పొందవచ్చని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment