సమ్మెకు సిద్దమైన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

సమ్మెకు సిద్దమైన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

3నెలలుగా జీతాలు పెండింగ్!

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆసుపత్రి సూపెరడెంట్ వీరారెడ్డికి ప్రభుత్వ హాస్పటల్ వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు నేడు సమ్మె నోటీసులు అందజేశారు. యూనియన్ అద్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ.. దాదాపు 250మందికిపైగా సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదన్నారు. పెండింగ్ బిల్లులను ఈనెల 24లోపు విడుదల చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విధులు బహిష్కరించి, దర్నా చేపడతామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment