గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులుగా కస్తూరి సతీష్…..తొలిసారి బ్యాలెట్ ద్వారా అధ్యక్షున్ని ఎన్నుకున్న నాయి బ్రాహ్మణులు…  

 గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ సంగం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం ఎల్బినగర్  లోని కాస్మో ఫంక్షన్ హాల్ లో హడ్ హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాలెట్ ద్వారా నిర్వహించారు, అధ్యక్ష పీఠానికి ముగ్గురు సభ్యులు పోటీపడగ , ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన ఓటింగ్ లో 730 ఓట్లు పోల్ అవడం జరిగింది, ఇందులో కస్తూరి సతీష్ 388, మామిడాల బాలు 240, మేడిపల్లి కర్ణాకర్ 66, ఓట్లు పడగా 148 ఓట్ల ఆదిత్యతో సమీప ప్రత్యర్థి మామిడాల బాలు పై కస్తూరి సతీష్ విజయం సాధించారు. ఇట్టి ఎన్నికల కార్యక్రమ నిర్వహణ సభ్యులు కొడెపాక రాజేందర్. మేడిపల్లి దశరథం.నాగరాజు. మధు. వేణు తదితరుల ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత నడుమ బ్యాలెట్ పత్రాలతో నిర్వహించి గ్రేటర్ వరంగల్ అధ్యక్షులుగా కస్తూరి సతీష్ గెలుపొందినట్లు ప్రకటించారు.ఇట్టి కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ నలుమూలల నుండి నాయి బ్రాహ్మణ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment