హుటాహుటిన ఫామ్ హౌజ్ నుంచి AIG ఆస్పత్రికి కేసీఆర్.

హుటాహుటిన ఫామ్ హౌజ్ నుంచి AIG ఆస్పత్రికి కేసీఆర్.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు.వైద్యులు పలు హెల్త్ టెస్టులు చేశారు. రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు.గతంలో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్.. ఇపుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఏడాది క్రితం కాలు జారి పడినప్పుడూ సోమాజిగూడ యశోదలోనే ఆయన తుంటికి ఆపరేషన్ చేశారు. కేసీఆర్ రెగ్యులర్ చెకప్ కూడా ఎప్పుడూ అక్కడే చేస్తుంటారు. కానీ ఈ మధ్య గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వస్తున్నారు.మరోవైపు ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వరంగల్ లో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆస్పత్రిలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.

Join WhatsApp

Join Now

Leave a Comment