తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష:మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనే శ్రీరామరక్ష అని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పురపాలక కేంద్రంలోని పైలాన్ పార్క్ ఆవరణంలో మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి చౌటుప్పల మండల,పురపాలక కమిటీల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్ర సమితి మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వారి సమక్షంలో గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకుల అందరూ కలిసి కేక్ కట్ చేసి ఇరువురు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సాధన తోనే ఫ్లోరోసిస్ దృష్ట్యా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో పైలాన్ పార్క్ ఏర్పాటు ఘనత కెసిఆర్ దే అని కొనియాడారు. కెసిఆర్ జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన శ్రీ రామ రక్షా అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బేడీల పాలన రైతు కార్మిక ఉద్యోగ వ్యతిరేక పాలనని వాపోయారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గ్రామ గ్రామాన ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగావారు నూరేళ్లు ఆయుషుతో బ్రతకాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, చిన్నం బాలరాజు, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేష్ యాదవ్, రైతు సంఘం అధ్యక్షులు కొత్త పర్వతాలు యాదవ్,బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.