రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ను తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో మధు కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.లాస్య తన కూతురు అద్విత(4) తో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శ నానికి వచ్చింది. దర్శనం కోసం వచ్చిన మహబూబా బాద్‌కు చెందిన ముగ్గురు మహిళలతో చనువు ఏర్పడింది.
ఐదు రోజులుగా ఆలయ ఆవరణలో నిద్ర చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో పాప తల్లి మతిస్థిమితం లేకపోవడం కారణంగా పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గమనించిన ముగ్గురు మహిళలు లాస్యను నమ్మించి గత డిసెంబర్ 23వ తేదీన వారితో పాటు తీసుకువ