బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం నూతన హంగులతో ఏర్పాటు చేసిన బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. బి.ఆర్.కె కన్వెన్షన్ హాల్ యజమానులు భాను ప్రకాష్, ఖలీల్, రవిలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పుష్పగుచ్చంను అందజేసి, సన్నాయి స్వరాల మధ్య ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కన్వెన్షన్ యజమానులు భాను ప్రకాష్, ఖలీల్, రవిలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ్మ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment