మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడు నుండి వివిధ మార్గాల్లో నడిపేందుకు 6 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మరికొన్ని మార్గాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీపీ బుజ్జి నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Published On: December 14, 2024 10:18 pm
