కరీంనగర్ సభకు బయలుదేరిన కేటీఆర్

కరీంనగర్ సభకు బయలుదేరిన కేటీఆర్

హైదరాబాద్, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఆదివారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.

వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమా వేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి రానున్నారు.

కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో జరిగే ఈ సమావేశానికి ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. వరంగల్ లో వచ్చే నెల 27 వ తేదీన జరిగే పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు.

ఇప్పటికే కేటీఆర్ సూర్యా పేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. వరసగా అన్ని జిల్లాలను కేటీఆర్ పర్యటిస్తున్నారు. కార్యకర్తలలో, నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కరీంనగర్ రాక సందర్భంగా పార్టీ కార్య కర్తలు పెద్దయెత్తున భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి రానుండగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నా రు. కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోని వీ కన్వెన్షన్‌లో జరిగే సభకు ఐదు వేలకు పైగా ముఖ్య కార్యర్తలు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కేటీఆర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చేప్పేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని రాంనగర్‌ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై, తెలంగాణ చౌక్‌, కమాన్‌ మీదుగా సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. స్వాగతం తర్వాత జరిగే సభలో కేటీఆర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment