రేపు విచారణకి హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకి స్పందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో.. హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరిన కేటీఆర్. ఈ మేరకు ఈడీకి తన సమాధానం పంపిన కేటీఆర్. నేడు ఏసీబీ విచారణ కొరకై ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే విచారణకు తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఏసీబీ ఏఎస్పీ అధికారి ఖాన్‌కు లిఖితపూర్వకంగా లేఖను అందజేశారు. ‘మీకు కావాల్సిన సమాచారం నేను ఆదజేస్తానని’ ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.