ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
నేడే కేటీఆర్ ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తుండడం ఈప్రచారానికి బలం చేకూరుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు..