విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి , సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ )కు చేరుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి, శ్రీనివాసవర్మ అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సమావేశం కానున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లడంపై వారితో చర్చించనున్నారు.అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద కుమారస్వామికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేశ్‌, భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత కుమారస్వామి నేరుగా స్టీల్‌ప్లాంట్‌లోని హిల్‌టాప్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ కాన్వాయ్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. షీలానగర్‌ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ధ్వంసమైన వాహనాల్లో మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు కూడా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment