తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని కలిసిన లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులు
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం.
అన్యాయంగా పెట్టిన కేసులన్నిటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
వికారాబాద్ జిల్లా ఎస్పీతో మాట్లాడిన కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యలను లెవనెత్తుతాం
అండగా ఉంటామని లగచర్ల బాధితులకు భరోసా
లగచర్ల భూసేకరణ బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిసి వివరించారు.
కేటీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్ రద్దు చేసుకుందన్నారు.* *కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన భూములను వదిలి, రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరణ చేసి పరిశ్రమల కోసం ఉపయోగించాలన్న కేటీఆర్, గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.