నిక్షిప్తపాతంగా భూ సర్వే నిర్వహించాలి
రైతుల సమక్షంలోనే భూ రీసర్వే నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మండలంలో పెనుబర్తి, కనిమెట్ట గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. గతంలోజరిగిన తప్పిదాలు, పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే రైతులకు నోటీసు లు జారీచేసి వారి సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల పక్కన ఉన్న భూముల్లో సర్వే చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వెంకటేష్ రామానుజులుకు సూచించారు. రీసర్వే డీటీ వైకుంఠరావు, మండల సర్వేయర్ గణపతి పాల్గొన్నారు. రెవె న్యూ సదస్సుల్లో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లోని పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల నుంచి 8వేల ఫిర్యాదులు వచ్చాయని ఆర్డీవో సాయిప్రత్యూష తెలిపారు. దళ్లవలస రెవెన్యూలోని భూ సమస్యలపై ఆమె వీఆర్వోలు, సర్వేయర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. దళ్లవలసలోనే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయని, వీఆర్వో లేకపోవడంతో పరిష్కరించేందుకు ఇబ్బంది వస్తోందని సచివాలయ కార్యదర్శి జగదీష్, గ్రామస్థులు ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. వీఆర్వోను నియమించి ఫిర్యాదులు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నోటీలకు స్పందించిన రైతుల సమస్యలన్నింటినీ 5 రోజుల్లోగా పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.