ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం
ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు. ఉరవకొండ పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా స్వచ్ఛంధ్రా, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. వైస్‌ప్రిన్సిపాల్ మస్తానయ్య, వెంకటరాముడు, పరమేష్, ఆదినారాయణ, ఐటీఐ కళాశాల శిక్షణాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, అధ్యాపకులు దుర్గాప్రసాద్, తిరుపతయ్య పాల్గొన్నారు.అలానే గుత్తిపట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుత్తి కోట వద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప ఆధ్వర్యంలో స్వచ్చంధ్ర స్వచ్చదివాస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ పేపర్లు, చెత్తచెదారాన్ని తొలిగించారు. కూడేరులో అంగనవాడీ కేంద్రంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి సూచించారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, ఏపీఓ తులసీప్రసాద్, సర్పంచు లలితమ్మ పాల్గొన్నారు.