రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్, మార్చి 13, సమర శంఖం ప్రతినిధి:-మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే హోలీ రోజు బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హోలీ సందర్భంగా బీఫ్ దుకాణాలను సైతం ఆ రోజు మూసి వేయాలని నిర్వాహకులను బల్దియా అధికారులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ శాఖ వెల్లడించింది.