శ్రీశైలంలో 11 రోజుల పాటు కొనసాగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈనెల 23న మల్లికార్జున స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరాలు సమర్పించనున్నారు. 25న కీలక ఘట్టం… పాగాలంకరణ జరుగుతుంది.