అమీన్ పూర్ లో ఘణంగా మహాశివరాత్రి మహోత్సవాలు
బీహెఈయల్ సహస్ర నామ జీ గుట్ట ,నవ్య కాలనిలో గల రాధా కృష్ణ ఆలయంలో అర్ధనారీశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిపించిన ఆలయ ధర్మకర్తలు.ఉదయం నుంచి నవ్య నగర్ , లేక్ వ్యూ కాలని,నరేంద్ర నగర్ మరియు పరిసర కాలని వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాలు,పూజలు చేసారు.శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు.పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి సాంస్కృతి కార్యక్రమాలకు ముగ్ధులు అయ్యారు.ఆలయ ధర్మకర్తలు శ్రీ P నరసింహారెడ్డి గారు,శ్రీ P సత్యనారాయణరెడ్డి గారు,శ్రీ P శ్రీకాంత్ రెడ్డి గారు అధ్యక్షతన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.