డప్పు చప్పుళ్ల మధ్య బోనమెత్తిన జోగిని
అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన గ్రామ ప్రజలు
భవిష్యవాణి వినిపించిన మాతంగి
వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో మంగళవారం మైసమ్మ పండగ అంగరంగ వైభవంగా జరిగింది.ప్రతి మూడు సంవత్సరాలు ఒక సారి మైసమ్మ పండుగను ఆనవాయితీ గా గ్రామస్తులు నిర్వహిస్తారు.గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యెక పూజలు చేశారు. గ్రామంలో డప్పుచప్పుల మధ్య జోగినితో బోనం తీశారు.అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు అనంతరం మైసమ్మ దేవాలయం వద్ద మాతంగి గ్రామ భవిష్యవాణి వినిపించారు.అమ్మవారిని నమ్ముకుంటే ప్రజల పై ఆ తల్లి చల్లని చూపు ఉంటుందని,పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటుందన్నారు.ప్రజలు అంటు వ్యాధుల బారిన పడకుండా ఉంటారని భవిష్యవాణి వినిపించింది.అనంతరం పోతరాజుల విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాణిక్య రెడ్డి,సాయన్న ,లాలయ్య,గోపాల్,బాల్ రాజ్,మల్లేష్, యువకులు తదితరులు ఉన్నారు.