మల్కాపురం హైస్కూలు ఫిజికల్ డైరెక్టర్ భావనకు డాక్టరేట్*
దేవరకొండ మండలం పడమటిపల్లి తండా కు చెందిన అన్నలూరి భావన పాత్లావత్ బుజ్జి, గిరిజన బాలికలలో ప్రథమంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో “హైస్కూలు బాలికల శిక్షణ, ఆటలలో మెరుగు పరచడం” పై డాక్టరేట్ తీసుకున్నారు.
ప్రస్తుతం మల్కాపూర్ ZP హై స్కూల్ నందు ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ మరియు సీనియర్ ప్రొఫెసర్ మరియు డీన్, ఫాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ L. B. లక్ష్మీ కాంత్ రాథోడ్ మార్గదర్శకత్వంలో PhD పూర్తి చేయటం జరిగింది. శ్రీమతి భావన గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉత్తమ ఉపద్యాయిని గా అవార్డ్ తీసుకొన్నారు. చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ గల భావన తాను స్వయంగా పలు జాతీయ క్రీడలలో పాల్గొనటమే కాకుండా, తన 24సంవత్సరాల సర్వీసులో దాదాపు 50 పైన తన విద్యార్థులను జాతీయ క్రీడలకు, 1000 పైగా విద్యార్థిని, విద్యార్థులను రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపి పోరోత్సహించారు. తన డాక్టరేట్ పూర్తి చేయటం లో సహకరించిన తల్లిదండ్రులకు, బంధు మిత్రులకు, గురువులకు, పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.