మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులవారి కార్యాలయం-హైదారాబాద్.

ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, భారతదేశ సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్ధికమేధావి, ప్రగతిశీల ఆర్ధిక విధానాలు అమలు ఒకవైపు.. సామాజిక సంక్షేమ ఫలాలను మరోవైపు అందించి.. దేశరాజకీయ చిత్రపటంలో తనదైన ముద్రవేసిన నిజప్రజానాయకుడు, పద్మవిభూషణ్, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతినివ్యక్తం చేశారు. ఈ దేశం ఒక గొప్ప ఆర్ధికవేత్తను కోల్పోయిందని మంత్రి ఆవేదనవ్యక్తం చేశారు. 

స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆహారభద్రతాచట్టం, సమాచారహక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో అద్భుతమైన చట్టాలను తీసుకువచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 8-9% నమోదు చేసి ప్రపంచంలో నెంబర్-1 గా నిలిచిందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment