మంథని: ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మంథని, ఏప్రిల్ 09, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, యువ నాయకులు శ్రీను బాబు ఆదేశాల మేరకు మంథని ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు జంజర్ల శైలందర్ ఆధ్వర్యంలో బుధవారం ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంథని పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, ఆర్టిఏ మెంబెర్ మంథని సురేష్, మాజీ ఐఎన్టియుసి జాతీయ నాయకులు పేరావేన లింగయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, దొరగార్ల శ్రీనివాస్, పెరుగు తేజ పటేల్, రొడ్డ రాజేశ్వర్ రావు, రాజమల్లు, మంథని శ్రీనివాస్, రాధారపు నితీష్, నల్ల రాజశేఖర్, శీలం ఈశ్వర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ సోషల్ మీడియా కోకో ఆర్డినేటర్ పంచిక దేవేందర్ యాదవ్, నాయకులు నాంపల్లి సతీష్, జంజర్ల రాకేష్, పోరండ్ల రంజిత్, ఫైహిమ్, నాగుల రాజయ్య, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.