శంషాబాద్ విమానఆశ్రయం దగ్గర లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్:డిసెంబర్ 23 సమర శంఖమ్ :-

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక నిర్మాణంలో ఉన్న బ్యాటరీ తయారీ కేంద్రంలో మంటలు ఒక్కసారిగా చేలరేగాయి.. సమాచారం అందిన వెంట నే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.ఈ సంఘటన నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో చోటుచేసుకు న్నట్టు తెలుస్తోంది. మూడో అంతస్థులో మంటలు మొదలైనట్లు అధికారులు తెలిపారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రమాదాన్ని గమనించి భయంతో భవనం నుంచి పరుగులు తీశారు.  ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment