ప్రభుత్వ స్థలాలు కోని మోసపోవద్దూ..బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు మేయర్ అజయ్ యాదవ్ విజ్ఞప్తి

• ప్రభుత్వ స్థలాలు కోని మోసపోవద్దూ

• బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు మేయర్ అజయ్ యాదవ్ విజ్ఞప్తి

• రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సర్వే

• హద్దులు దాటితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిక

హైదరాబాద్ డిసెంబర్ 17 సమర శంఖమ్ :-

బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబరు 63/26 నుండి 63/38 లలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని భవిష్యత్తులో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇట్టి స్థలంలో ఎవ్వరూ కూడా క్రయవిక్రయాలు చేయవద్దని మనవి చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబరు 63/26 నుండి 63/38 లలో బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ అజయ్ యాదవ్, కమీషనర్ జీ.రామలింగం, మేడిపల్లి తహసీల్దారు హసీనా లతో కలిసి పర్యటించారు.అనంతరం మేడిపల్లి తహసీల్దారు, మేయర్ తోటకూర అజయ్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి కొంతమంది స్వార్దపరుల కారణంగా రోజు రోజుకు కుంచించుకు పోతుందని ఇలా అయితే భవిష్యత్తులో బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు అవసరాలకు భూమి లేకుండా పోతుందని దానిని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా దళాలరుల మాటలు నమ్మి ప్రభుత్వ భూమిలో ఏలాంటి కొనుగోళ్ళు చేయవద్దని తెలిపారు.అదే విధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు ఈ రోజు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించామని భవిష్యత్తులో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment