ద్వారక తిరుమల: అంగన్వాడీ కారకర్తల సమావేశం
ద్వారక తిరుమల, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జంగారెడ్డిగూడెం పరిధిలోని ద్వారకాతిరుమల మండలంలో గల మూడు సెక్టార్ ల పరిదిలోని 77 అంగన్వాడీ కేంద్రాలలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ స్థానిక యుటిఎఫ్ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించారు.
మండలం పరిధిలోని సక్షం అంగన్వాడీలుగా ఎన్నిక కాబడిన 56 అంగన్వాడీ కేంద్రాలలోని కార్యకర్తలకు మరియు సుపోషిత్ గ్రామ పంచాయతీగా నామినేట్ చేయబడిన మద్దులగూడెం పంచాయతీలోని అంగన్వాడీ కార్యకర్తలకు రివ్యూ నిర్వహించారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.బ్యూలా పాల్గొని సక్షం అంగన్వాడీల పనితీరు మెరుగుపరచుకునేలా సూచనలు ఇచ్చారు. అంగన్వాడీ సేవల గురించి లబ్ధిదారులు అందరికి అవగాహన కల్పించి అందరికి సకాలంలో అంగన్వాడీ సేవలు అందేలా చూడవలెను అని మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమమునకు సెక్టార్ సూపర్ వైజర్ లు టి. మేరీ మరియమ్మ, యమ్. లక్ష్మి రాజ్యం, కె.మణి, కె.రాజు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.