కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం మెతుకు ఆనంద్…

---Advertisement---

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అంటూ అనవసరంగా కేటీఆర్ పై కేసు పెట్టి A1గా చేర్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిలో ఎక్కడ కూడా డబ్బులు కేటీఆర్ దుర్వినియోగం చేసినట్లు లేదు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచే విధంగా ఈ కార్ రేసింగ్ ను హైదరాబాద్కు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్ కు దక్కుతుంది. రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో మన హైదరాబాద్ పరువు పోవడమే కాకుండా కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టడాన్ని టిఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మొన్ననే మా లగచర్ల రైతులపై మరియు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పై కేసుల విషయం మరచిపోక ముందే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు పెట్టడం అన్యాయం. చివరికి న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని నమ్మకం ఉంది. మాకు న్యాయవ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment