అధికారులు చిత్త శుద్ధితో కృషి చెయ్యాలి. మంత్రి బండి సంజయ్ కుమార్

 

 

నారాయణపేట ప్రతినిధి: నిరుపేదల అభ్యున్నతికి అధికారులు చిత్త శుద్ధితో కృషి చేయాలని, 2028 సంవత్సరం నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా పర్యటన లో భాగంగా నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మంత్రి, బండి సంజయ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ శాలం, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, బండి సంజయ్ కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఆయన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్ వాడీ పిల్లలను ఊరి పేరు, మండలం, జిల్లా పేరు అడిగి వారితో జవాబు రాబట్టారు. సెంటర్ లో ఎంత మంది పిల్లలు ఉన్నారని,అందులో శ్యాం మ్యాం పిల్లలు ఎంతమంది అని టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆట వస్తువులను చూసి, పిల్లలికి ఇచ్చే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని టీచర్ ను అడగడంతో ఫర్నీచర్ అవసరమని, నీటి సమస్య ఉందని టీచర్ తెలిపారు. అధికారులకు చెప్పి ఫర్నీచర్ ను సమకూర్చుతానని, నీటి సమస్యను పరిష్కారింప చేస్తామని ఆయన తెలిపారు. వంటగది శుభ్రంగా ఉందని మెచ్చుకున్నారు. గర్భిణీలకు అందించే ఆహారం ఎలా ఉంటుందని ఆరా తీశారు. అక్కడే ఉన్న ఐదుగురు గర్భిణీలకు శ్రీమంతంలో భాగంగా పండ్లు, పసుపు, కుంకుమ, గాజుల కిట్టును అందజేశారు. ఇద్దరు చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. కిచెన్ గార్డెన్ లో ఏ ఏ కూరగాయలు పండిస్తారని అడిగి తెెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment