రాజలింగమూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుల మాటలు విని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక వ్యక్తిని హత్య చేయించడం మంచిది కాదని మండిపడ్డారు. వెంకటరమణారెడ్డి గతంలో దోచుకున్న మాట నిజమేనని ఆరోపించారు.రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు.ఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోండి. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారు. సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యను ఖండిస్తున్నాను’’ అని అన్నారు.