దేవగుడి సినిమా షూటింగ్ ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాప్తా రెడ్డి

రాయచోటి పట్టణంలోని చిత్తూరు బైపాస్ రోడ్డు పంజాబీ డాబా నందు దేవగుడి సినిమా షూటింగును శనివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… దేవగుడి సినిమా చిత్రీకరణ అత్యంత ఘనంగా పూర్తి చేసుకుని సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు రావాలన్నారు. ఈ సినిమాలో హీరో అభినవ్, హీరోయిన్ అనుశ్రీ ల కాంబినేషన్ చూపరులను ఆకట్టుకునే విధంగా ఉందని సినిమా షూటింగ్ లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత ఘనంగా చిత్రీకరణ పూర్తికావాలని మంత్రివర్యులు కోరారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment