కాటారం: కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, మార్చి 30, సమర శంఖం ప్రతినిధి:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కెమెరాల కమాండ్ కంట్రోల్ రూం ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.
అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నేరాలను పసిగట్టి శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులకు ప్రజలు అండగా నిలవాలని అన్నారు.
నేరాలను పసిగట్టి అదుపు చేయడానికి కాటారం పోలీస్ వారు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
కాటారం అన్ని కాలనీల్లో దాదాపు 63 కెమెరాలను అమర్చి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూంలో మానటరింగ్ చేస్తారని తెలిపారు.
ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల నిరోధానికి పోలీసులకు సహాకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణాకు సహకరించుతున్న ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదనీ, వారి పట్ల పోలీసులు కఠినంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
మరొకవైపు బిట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్న వారిపై, వారికి సహకరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ పెట్టి సర్వం కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
నియోజకవర్గంలో విడతల వారీగా ప్రతి మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిదని, అలాంటి విధులను నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇసుక రవాణా చేసే లారీల వేగాన్ని నిరోధించాలని వివిధ శాఖల అధికారులకు శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో మండలాల కేంద్రంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంతటి వారు ఫోన్ చేసినా, చివరికి మంత్రిగా తాను ఫోన్ చేసినా కూడా న్యాయం అన్యాయాలు చూసి పోలీసు వారు పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నదా అధికారులు. ఎస్సైలు సీఐలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు