సమర శంఖమ్ డిసెంబర్, 29 :-
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దు లో డ్రగ్స్ కలకలం రేపాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ పోలీసులు(Excise Police) డ్రగ్స్(Drugs) స్వాధీనం చేసుకున్నారు. బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుందగా తనిఖీలు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గంజాయి, డ్రగ్స్ కట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గంజాయి సాగు, సరఫరా మొదలుకొని విక్రయాల వరకూ ఎవరు పట్టుబడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు.