ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
ఖైతపురం గ్రామంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికల సన్నాహక సమావేశం గౌరవ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం చింటు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండలం కాంగ్రెస్ పార్టీ నుండి ఇంచార్జిగా వచ్చిన చింతల సాయిలు గారు మరియు మాజీ ఎంపీటీసీ గోపి సుధాకర్, మాజీ సర్పంచ్ గుడ్డేటి యాదయ్య గార్లు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు వివరించారు మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ పథకం, గృహానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్ లు, త్వరలో రాబోయే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్స్ ఇంకా అనేక పథకాలు గురించి ప్రతి ఓటర్ కు వివరంగా చెప్పి ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేపించ్చే విధంగా ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ఎన్నికలలో నిలబెట్టిన ఆ అభ్యర్థిని మనం గెలిపించుకుందాం అని తెలిపినారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కాండగట్ల వెంకటరెడ్డి తగరం నాగరాజు, గోపి మహేష్, ముద్ధం పర్వతాలు పక్కిర్ రాంరెడ్డి కందగట్ల నర్సిరెడ్డి వెల్మ మధుసూదన్ రెడ్డి గోపి మురళీ, గోపన బోయిన రాములు తగరం నరహరి గోపి శ్రీశైలం పక్కీర్ అంజిరెడ్డి ముద్దాం మల్లేష్ తగరం వెంకటేశ్ గుడ్డెటి యాదగిరి కొల్కులపల్లి ప్రవీణ్ కొమ్ము నరేందర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.