చదువు, ఆరోగ్యం పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత…ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

సమర శంఖమ్ తెలుగు దిన పత్రిక చౌటుప్పల్ :

విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో డైట్ చార్జీల పెంపు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మెస్ ఛార్జ్ ల పెంపు చేయడం ఆనందకరం అని,పిల్లలకు ఆహరం చాలా ప్రాధాన్యం అయిందని వారికీ నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలన్నారు.పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి వారికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టీచర్లకు సూచించారు.విద్యావిధానంలో అత్యంత ముఖ్యమైనది 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇచ్చే శిక్షణ అని అన్నారు.వారి భవిష్యత్ తీర్చే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని గుర్తుచేశారు.పిల్లలకు విద్య పై అవగాహనా కల్పిస్తూ క్రమశిక్షణతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment