సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

పాలకుర్తి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవారుప్పాల మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 26,80,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఈ సందర్భంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్, వివిధ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment