కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ

క్రమ సంఖ్య రెండులో నరేందర్ రెడ్డి కి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, పట్టభద్రులతో సమీక్షా సమావేశం నిర్వహించిన. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున KGN ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్,- కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా. వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఓదెల మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గురించి దిశా నిర్దేశం చేసి పట్టభద్రులంతా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా పనిచేయాలని సూచించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ..

అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి కరపత్రాన్ని స్థానిక నాయకులతో, పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే విజయరమణా రావు …

ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు. సంవత్సరం కాలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకు అందించిన ఉద్యోగాలు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, ఎండీ మునీర్,వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎండి సజ్జు, డొంకిన మొగిలి పనాస మల్లయ్య రావి సదానందం పనాస మల్లయ్య ఆరెల్లి రమేష్, కొత్తూరు ముండయ్య, మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ ,గాజుల మోహన్, జిన్న రామచంద్రన్ రెడ్డి, బంగారు రమేష్ ,దేవేందర్రావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు,కార్యకర్తలు, పట్టభద్రులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment