కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ . పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్న తిన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ సంఘం. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డి.ఈ చర్యపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మల్లన్న గత బీఆర్ ప్రభుత్వ హయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. బీజేపీలో చేరారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్ పార్టీ తరపున 2024లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు.