మోహన్ బాబు ను అరెస్టు చేయాలి… టియుడబ్ల్యూజె మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు… 

మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గడ్డమీది బాలరాజు డిమాండ్ చేశారు. సినీ నటుడు మోహన్ బాబు విలేకరుల లై చేసిన దాడిని ఖండిస్తూకూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులందరూ కె.పి.హెచ్.బి ఒకటో రోడ్డు లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా సినీ నటుడు మోహన్ బాబు వ్యవహరించాడని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనపై అత్యా యత్నం కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియాపై తరచుగా జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎంఏ కరీమ్ , ప్రధాన కార్యదర్శి రంజిత్ ఎడ్ల ,జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యా రెడ్డి, నాయకులు లక్ష్మణ్, హరిబాబు, శశిధర్ పంతులు, శ్రీధర్, హరి, క్రాంతి కుమార్, విష్ణు, సతీష్ నాయుడు, ప్రవీణ్, ఆనంద్ రావు,చంద్రకాంత్, శ్రావణ్, పవన్ , మారుతి , హరి కృష్ణ,సముద్రాల కిరణ్, రాము,ధనుంజయ్ చారి, సత్యా, షబ్బీర్ అలీ, నాగరాజు,రెహమాన్, బలరాం, కుత్బుల్లాపూర్ కార్యదర్శి సాయిబాబా,తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు..నిరసన కార్యక్రమంలో భాగంగా కే.పి.హెచ్.బి సర్కిల్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావుకి పిర్యాదు చేసారు. విలేకర్ల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment