పార్లమెంట్ పై ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు: ఎంపీ రవిచంద్ర

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.పాకిస్థాన్ ఐఏస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 13వతేదీ) పార్లమెంటుపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ఆ ముష్కరుల దాడిలో ప్రాణాలర్పించిన పార్లమెంట్ ఉద్యోగులు,భద్రతా సిబ్బందికి ప్రతిఏటా ఇదే రోజున వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment