ఎంపీ వద్దిరాజు ఢిల్లీలో ప్రసంగం…

ప్రధాని మోడీ ఓబీసీ అయ్యి ఉండి కూడా న్యాయం చేయకపోవడం విచారకరం:

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఖాళీల భర్తీలో ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎంపీ రవిచంద్ర..

కేసీఆర్ హయాంలో తమకు సముచిత గౌరవం లభించింది…

దేశవ్యాప్తంగా కులగణనను వెంటనే చేపట్టాలి..

చట్టసభల్లో రిజర్వేషన్స్ సాధన,రాజ్యాధికారమే ధ్యేయంగా, లక్ష్యంగా ఓబీసీలు మరింత సంఘటితమై ముందుకు సాగాలి..

ఓబీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యాన ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర…

 హైదరాబాద్ డిసెంబర్ 11 ( సమర శంఖమ్ )

ఐఏఏస్ రిటైర్డ్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యాన ఏర్పాటైన ఈ సదస్సుకు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు మధుసూదనాచారి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే మధుకర్,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ సుధాకర్ తదితరులు హాజరై ప్రసంగించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓబీసీ అయ్యి ఉండి కూడా అన్ని రంగాలలో మనకు అన్యాయమే జరుగుతుండడం తీవ్ర విచారకరమని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.మోడీ ప్రధాని పదవి చేపట్టి 11సంవత్సరాలు పూర్తైన కూడా కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం, చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించకపోవడం బాధాకరమన్నారు.ఓబీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థావకులు, రిటైర్డ్ ఐఏఏస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యాన ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం సదస్సు జరిగింది. కులగణనను దేశవ్యాప్తంగా వెంటనే చేపట్టాలి, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ ఏర్పాటు చేసిన సదస్సుకు ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.సదస్సులో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, జనాభాలో 60శాతానికి పైగా ఉన్న ఓబీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.దేశవ్యాప్తంగా జనగణన త్వరలో మొదలుకానున్నందున,ఇందులో కులగణనను కూడా ఒక అంశంగా చేపట్టి అన్ని కులాల జనాభా మొత్తాన్ని తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తద్వారా వచ్చే ఎన్నికల నుంచి చట్టసభలలో మహిళలతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్స్ అమలవ్వడానికి వీలవుతుందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా, ఓబీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించకుండా మహిళా రిజర్వేషన్స్ అమలు పర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.చట్టసభల్లో మహిళ,ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేసిన విషయాన్ని ఎంపీ వద్దిరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మంత్రిమండలిలో ఏడాదిగా ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీ సందర్భంగా బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో బీసీలకు సముచిత గౌరవం లభించిందని వివరించారు.మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగడం ద్వారా చట్టసభల్లో రిజర్వేషన్స్ సాధించుకుందామని ఎంపీ రవిచంద్ర ఓబీసీలకు పిలుపునిచ్చారు.ఈ విధమైన సభలు,సమావేశాలు,సదస్సులు, చర్చాగోష్ఠుల ద్వారా ఓబీసీల సంఘటిత శక్తిని దేశవ్యాప్తంగా చాటి చెబుదామన్నారు.ఈ సదస్సులో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్,మాజీ ఎమ్మెల్యే అనిల్, ఓబీసీ నాయకులు సిద్ధేశ్వర్,డీ.వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా “వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి ఓబీసీల ఐక్యత వర్ధిల్లాలి”,”చేపట్టాలి చేపట్టాలి కులగణనను దేశవ్యాప్తంగా వెంటనే చేపట్టాలి”,”ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి”,” అమలు చేయాలి అమలు చేయాలి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ అమలు చేయాలి”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment