లక్ష్మీ భవాని దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం — ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్, 17 (సమర శంఖమ్ ) :-

ఖమ్మంలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని లక్ష్మీ భవాని ఎలుకల దాడికి గురై, సరైన వైద్యం అందక, కాలు, చేయి చచ్చుబడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. లక్ష్మీ భవాని ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ నుంచి ఘటన గురించి తెలుసుకుని, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత విద్యార్థిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఏడాది కాలంగా సంక్షేమ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు, మంచి ఆహారం అందక విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడటం.. ఆస్పత్రుల పాలవుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. హాస్టళ్లలో వసతుల గురించి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ప్రతిష్టకు పోయి నిరుపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. సంక్షేమ హాస్టళ్లలో సరైన మౌళిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన ఆహారం అందించాలని ఎంపీ రవిచంద్ర కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment