గాంధీ భవన్ లోమంత్రులతో ముఖా ముఖి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ 

గాంధీ భవన్ లోమంత్రులతో ముఖా ముఖి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ 

కేటీఆర్ విమర్శల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. పనికి రాని మాటల గురుంచి మాట్లాడితే టైం వెస్ట్

అంచాలంచలుగా ఎదిగి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయ్యాడు

ఇప్పటి నుండి మళ్ళీ ఈ కార్యక్రమం కొనసాగుతుంది

పీసీసీ ఆదేశాల మేరకు… ఇది కొనసాగుతుంది..

ప్రజలు ఎక్కడికి వచ్చి అయిన వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు…

గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు… తెలంగాణా ఉద్యమం లో గద్దర్ ఉన్నడు.. బండి సంజయ్ ఉన్నడా…?

అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి. ఉద్యమం చేసిండు

కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడం కరెక్ట్ కాదు

కేటీఆర్ నల్గొండ ధర్నాకు మా మీటింగ్ లో పల్లి గింజలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది వచ్చిండ్రు

ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు… ఈ మొకం పెట్టుకుని వచ్చిండు.

కేటీఆర్ పదేండ్ల లో ఫ్లో్రైడ్ పెంచి పోషించిండు..

పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే.. అధికారం పోగానే నీతులు చెప్తున్నారు..

*కేటీఆర్, హరీష్ రావు నా కాళీ గోటికి కూడా సరిపోరు..*

కెసిఆర్ పేరు చెప్పుకుని మంత్రివి అయ్యావు..

*నీతి నిజాయితీ కి మారు పేరు వెంకట్ రెడ్డి*

*అవినీతి మరక ఉన్నదా…. నాకు ఎక్కడైన…*

*ప్రతి పక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే…. ఎం చెప్తారు*

మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు..?

*ఇక్కడ మూసి చేయొద్దటా… అక్కడ యమున చేస్తారట…..*

*మూసి క్లీన్ చేస్తాం అంటే… అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ లలో పడుకున్నారు..*

*నాపై మాట్లాడినికి కెసిఆర్ కి నైతిక హక్కు లేదు……. Ktr బచ్చ..*

*వాళ్ళ దగ్గర ఏముంది… లక్షల కోట్లు… ఈ కార్ రేస్… అవినీతి తప్ప*

*నాకు లక్షల కోట్లు లేవు… ప్రజల అండ దండలు ఉన్నాయి*

అమెరికా లో చదువుకుని…. ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు..

*నేను తిడితే వాళ్ళ తలకాయ పగిలి పోతది*

*జైలు కి పోయిన లాలు ప్రసాద్ నయ్యం… కెసిఆర్ జైలు కి పోకుండానే… ఒక్క సారి అసెంబ్లీ కి రాలేదు…*

*మామ చాటు అల్లుడు.. హరీష్ రావు…*

*తండ్రి చాటు కొడుకు కేటీఆర్..*

*అక్షర చిట్ ఫండ్ స్కామ్ అగ్రిగోల్డ్ స్కామ్ లాంటిదే*

* ఈరోజు గాంధీభవంలో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

* ఈ ముఖాముఖి కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్ బాధితులు.. అక్షర చిట్ ఫండ్ ఎం.డి. పేరాల శ్రీనివాస్ రావు చేసిన మోసాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తెచ్చారు.

* వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాష్ట్ర డీజీపి కి ఫోన్ చేసి నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకొని భాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.

* పేదల సొమ్మును కొలగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

* మంత్రి ఆదేశాల మేరకు, పేదలు సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి తెలిపిన డిజిపి

Join WhatsApp

Join Now

Leave a Comment